YS Sharmila: వైఎస్ షర్మిల భద్రత తగ్గింపు.. కాంగ్రెస్ నేతల ఆందోళన.. 

By Rajesh Karampoori  |  First Published Jan 31, 2024, 11:01 PM IST

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అద్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రత విషయంలో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కేవలం 1+1 భద్రత కల్పించడంపై అభ్యంతరం తెలిపారు. గతంలో వైఎస్ షర్మిలకు తెలంగాణ పోలీసులు 4+4 భద్రత కల్పించిన విషయం తెలిసిందే.  


YS Sharmila: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) భద్రతపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వైఎస్‌ షర్మిలకు 4+4 సెక్యూరిటీ కలిగి కల్పించారని తెలిపారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తరువాత షర్మిల మరింత చురుకుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. కార్యకర్తల సమావేశాల కోసం ఆమె రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. 

ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ తరుణంలో ఆమెకు సరైన భద్రత కల్పించాలని , కానీ కేవలం 1+1 భద్రత కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ షర్మిల కోరినట్టు.. 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ డీజీపీని కోరారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం షర్మిలకు 4+4 భద్రత కల్పించారు. 

Latest Videos

మరోవైపు.. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు జగన్ సర్కార్ 1+1 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ధ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ ద్వారా భద్రత పెంపుపై నిర్ణయం తీసుకోవాలనీ, పోలీసులు 4+4 భద్రత, ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేయాలని కోరుతూ  డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆమె లేఖ రాశారు.

click me!