తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దు .. లాస్ట్ మినిట్‌లో వెనక్కి , కొల్లాపూర్‌ సభకు రాహుల్ ఒక్కరే

Siva Kodati | Published : Oct 31, 2023 4:18 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం కొల్లాపూర్‌లో నిర్వహించనున్న సభలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సభకు చివరి నిమిషంలో ప్రియాంకా గాంధీ గైర్హాజరు కానున్నారు. 

Google News Follow Us

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం కొల్లాపూర్‌లో నిర్వహించనున్న సభలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సభకు చివరి నిమిషంలో ప్రియాంకా గాంధీ గైర్హాజరు కానున్నారు. షెడ్యూల్ ప్రకారం రాహుల్, ప్రియాంకాలు సభలో పాల్గొనాల్సి వుండగా .. రాహుల్ మాత్రం హాజరుకానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌లో నిర్వహించనున్న పాలమూరు ప్రజాగర్జన బహిరంగ జరగనుంది. 

ALso Read: కామారెడ్డిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ వైఎస్ చైర్‌పర్సన్ ఇందుప్రియ..

ఇకపోతే..రెండు విడతల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్ధుల ఎంపిక ఓ కొలిక్కి రావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా అగ్రనేతలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే రాహుల్, ప్రియాంకాలు ఓ విడత ప్రచారం చేయగా.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు పలు సభల్లో పాల్గొన్నారు. ఇప్పటికే సర్వేల్లో కాంగ్రెస్‌కే ఎడ్జ్ వుందన్న వార్తల నేపథ్యంలో పట్టు జారకుండా వుండేందుకు ఆ పార్టీ ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. 
 

Read more Articles on