తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ విజయసాయి రెడ్డి

By narsimha lode  |  First Published Feb 5, 2024, 5:09 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.


న్యూఢిల్లీ: తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ ) ఎంపీ   విజయసాయి రెడ్డి ఆరోపించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  సోమవారం నాడు  వైఎస్ఆర్‌సీపీ  తరపున ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై  విజయసాయి రెడ్డి  విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర విభజన చేసినా కూడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదన్నారు.  రాష్ట్ర విభజన జరిగిన  పదేళ్ల తర్వాత  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.  తెలంగాణలో  అబద్దపు హామీలు ఇవ్వడంతోనే  తెలంగాణలో ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు.  త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  కూలిపోతుందని  ఆయన  చెప్పారు. 

Latest Videos

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ  విలన్ అని ఆయన ఆరోపించారు. ఏపీపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే  విభజన చట్టంలో  ప్రత్యేక హోదాను  చేర్చేవారన్నారు.  ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్ లో  ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు.  రాష్ట్రాన్ని విభజించే సమయంలో  కాంగ్రెస్ నేతల్లోనే ఏకాభిప్రాయం లేదని  విజయసాయి రెడ్డి  గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ప్రచార అస్త్రంగా  చేస్తుంది. వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ ఏడాది జనవరి 21న బాధ్యతలు స్వీకరించారు.  ప్రత్యేక హోదాకు  కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని షర్మిల హామీ ఇచ్చారు. 
 

click me!