బెజవాడ దుర్గగుడిలో ఊడిన సీలింగ్: ఈవో కోటేశ్వరమ్మకు గాయాలు

By Siva KodatiFirst Published Aug 1, 2019, 8:26 PM IST
Highlights

విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆలయ మహామంటపంలోని సీలింగ్ పెచ్చులు ఊడిపోయాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మకు స్వల్పగాయాలయ్యాయి

విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆలయ మహామంటపంలోని సీలింగ్ పెచ్చులు ఊడిపోయాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మకు స్వల్పగాయాలయ్యాయి.

ఆలయ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం వద్ద గోదావరిలో ప్రవాహం పెరగడంతో.. ఎగువనున్న 19 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.

వరద గ్రామాల్లో ప్రభుత్వం వైద్య శిబిరాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 7 లక్షల 43 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. అటు రాజమహేంద్రవరంలోనూ భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. 
 

click me!