తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Siva Kodati |  
Published : Aug 01, 2019, 05:53 PM ISTUpdated : Aug 01, 2019, 05:54 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3,  తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3,  తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది.

ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని , కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇందుకు సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించారు. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలిన, ఆగస్టు 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆగస్టు 26న పోలింగ్ జరిపి.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu