
అమరావతి: ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం ఓ నుండి నోట్ మంగళవారం నాడు అందింది.
రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అయితే కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారంగానే అధికారులు పనిచేయాల్సి ఉంటుందని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ తరుణంలో సీఎస్ ఏ రకంగా వ్యవహరిస్తారోననేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చే అధికారులు ఈసీ పరిధిలో పనిచేయాల్సి ఉంటుందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
సాధరణ పరిపాలన పరిధిలోకి వచ్చే అధికారులంతా బిజినెస్ రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని బాబు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని సీఎంఓ ప్రిన్సిఫల్ సెక్రటరీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి మంగళవాం నాడు నోట్ పంపారు.
అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయమై ఏం చేయాలనే దానిపై సీఎస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశం ఉందని చెబుతున్నారు ఎన్నికల సంఘం ఇచ్చే సూచనల ఆధారంగానే సీఎస్ సుబ్రమణ్యం కేబినేట్ భేటీపై నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా కేబినెట్ భేటీకి సంబంధించి సీఎస్ నుండి ఆయా శాఖల నుండి కేబినెట్‌లో చేర్చాల్సిన అంశాలపై ప్రతిపాదనలు తీసుకొంటారు. వాటి ప్రాధాన్యతను బట్టి కేబినెట్ ఎజెండాలో చేరుస్తారు.
సంబంధిత వార్తలు
క్యాబినెట్ భేటీ: చంద్రబాబుకు పరీక్ష, అధికారులు డుమ్మా?