రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్.. అందుకోసమేనా..?

Published : Jan 29, 2023, 04:05 PM ISTUpdated : Jan 29, 2023, 04:12 PM IST
 రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్.. అందుకోసమేనా..?

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. మంగళవారం (జనవరి 31) అక్కడ జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. మంగళవారం (జనవరి 31) అక్కడ జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ ద్వారా రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుస కార్యక్రమాలను నిర్వహించాలని యోచిస్తోంది. 

ఈ క్రమంలోనే సమ్మిట్‌కు మరింత మంది పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు సీఎం జగన్ స్వయంగా జనవరి 31న ఢిల్లీలో జరిగే సమావేశంలో వివిధ దేశాల రాయబారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అదే రోజు సాయంత్రం సీఎం జగన్ అధ్యక్షతన వివిధ పరిశ్రమల చైర్మన్లు, ఎండీలు, సీఈవోలతో సమావేశం జరగనుందని తెలిపాయి.

మరోవైపు సీఎం జగన్ ఇటీవల పొన్నూరు, హైదరాబాద్, విశాఖ పర్యటనలను రద్దు చేసుకోవడం.. ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై ప్రతిపక్షాల నుంచి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన  ప్రాధాన్యత సంతరించుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే