
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో (sri sathya sai district) పర్యటించనున్నారు. జిల్లాలోని చెన్నేకొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి జగన్ బయల్దేరుతారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చెన్నేకొత్తపల్లికి బయల్దేరుతారు.
10.50 గంటలకు చెన్నేకొత్తపల్లికి చేరుకుని... 15 నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడతారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందించి మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి తిరిగి బయల్దేరతారు. అనంతరం మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.