బాలిక‌పై వాలంటీర్ భర్త వేధింపులు.. స్నానం చేస్తుండగా వీడియో తీసి వేధిస్తున్నట్టుగా ఫిర్యాదు..

Published : Apr 24, 2022, 05:13 PM IST
బాలిక‌పై వాలంటీర్ భర్త వేధింపులు.. స్నానం చేస్తుండగా వీడియో తీసి వేధిస్తున్నట్టుగా ఫిర్యాదు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ వాలంటీర్ భర్తపై కేసు నమోదైంది. బాలికపై వేధింపులకు పాల్పడినందుకు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ వాలంటీర్ భర్తపై కేసు నమోదైంది. బాలికపై వేధింపులకు పాల్పడినందుకు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్ చదువుతున్న తమ కూతురు స్నానం చేస్తుండగా వాలంటీర్ భర్త వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక తల్లిదండ్రులు తిరువూరు పోలీసులను ఆశ్రయించారు. 

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను వేధించిన వాలంటీర్ భర్తకు కఠిన శిక్ష విధించాలని భాదితురాలు డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కొందరు రాజీ ప్రయత్నాలు చేసినట్టుగా తెలిసింది. అయితే బాలిక తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిపై వేధించిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇక, ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ఓ వాలంటీర్ బాలికపై అత్యాచారం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలి లంకకు చెందిన గ్రామ వాళ్లంటే బూసి సతీష్ (23) అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. గ్రామ పని చేస్తూ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఓ minor girlతో పరిచయం పెంచుకున్న యువకుడు ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు.  ఆ తరువాత ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించాడు. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్