ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: నేతన్నలకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.24 వేల సాయం

Published : Oct 16, 2019, 03:43 PM ISTUpdated : Oct 16, 2019, 04:07 PM IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: నేతన్నలకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.24 వేల సాయం

సారాంశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం అమరావతిలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. వైఎస్సార్ నేతన్న నేస్తం పేరుతో ప్రవేశపెట్టనున్న కొత్త పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రతి ఏటా చేనేత కార్మికుడికి రూ.24 వేలు ఆర్ధిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

వైఎస్ జగన్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. వైఎస్సార్ నేతన్న నేస్తం పేరుతో ప్రవేశపెట్టనున్న కొత్త పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం అమరావతిలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. ప్రతి ఏటా చేనేత కార్మికుడికి రూ.24 వేలు ఆర్ధిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ప్రతి ఏటా డిసెంబర్ 21న నేతన్నల ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. ఒకే విడతగా రూ.24 వేలు చేనేతకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని..  ఈ పథకం ద్వారా సుమారు 90 వేల కుటుంబాలకు లబ్ధి కలుతుగుందని మంత్రి వెల్లడించారు.

మగ్గం ఉన్న నేత కార్మికుల్ని గుర్తించేందుకు సర్వే చేపట్టనున్నారు. అలాగే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10 వేల ఆర్ధిక సాయాన్ని అందించాలని కేబినెట్ నిర్ణయించిందని.. బోటు ఉన్న కుటుంబాలతో పాటు తెప్పలపై వేటకు వెళ్లే కుటుంబాలకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్ని నాని పేర్కొన్నారు.

దీనితో పాటు మత్స్యకారుల బోట్లకు వినియోగించే డీజిల్‌పై సిబ్సిడీ పెంచుతున్నామని దీని ప్రకారం ప్రతి లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ అందిస్తామన్నారు. అందరికీ సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని..  ప్రతి కుటుంబానికి 105 నుంచి 110 లీటర్ల మంచినీరు అందిస్తామని మంత్రి తెలిపారు.

మధ్యాహ్న భోజనం వండే వాలంటీర్ల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతున్నామని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి జీతం అందేలా కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా జీతం డిపాజిట్ చేస్తామని... పలాసలో 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో నియామకాలకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని నాని చెప్పారు.

కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వాళ్లకు రూ.3 వేల గౌరవ వేతనం అందిస్తామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పోరేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులను గుర్తిస్తామని మంత్రి తెలిపారు.

ప్రభుత్వమే హామీగా ఉండి వాహనాలు అందజేసేలా పథకం రూపకల్పన చేస్తామని... 1000 కోట్లతో ఏపీఎస్‌ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. పొగాకు బోర్డు తరహాలో చిరుధాన్యాలు, అపరాల బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్నినాని వెల్లడించారు. 

కేబినెట్ మరిన్ని నిర్ణయాలు:

* ముమ్మిడివరం జీఎస్‌పీసీ ద్వారా ఉపాధి కోల్పోయిన 16,654 మంది మత్య్సకారులకు రూ.80 కోట్ల బకాయిలు చెల్లింపు
* కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరు మండలం రాష్ట్ర విపత్తుల సంస్థకి 39.23 ఎకరాల భూమి కేటాయింపు
* ప్రకాశం జిల్లాలో నడికుడి-శ్రీకాళహస్తి బ్రాడ్‌గేజ్ మార్గం నిర్మాణానికి 350 ఎకరాల భూమి రైల్వేశాఖకు కేటాయింపు
* రేణిగుంట విమానాశ్రయం విస్తరణకు 17 ఎకరాలు అప్పగింత
* రైతులకు ఉచిత బోర్ల కోసం 200 డ్రిల్లింగ్ బోర్ మిషన్ల కొనుగోలు
* ఇసుక రవాణా, పౌర సరఫరాలు సహా ప్రభుత్వం వాడే ప్రతి రవాణాలో స్వయం ఉపాధికి మంత్రివర్గం ఆమోదం
* పౌరసరఫరాల సంస్థ రుణపరిమితిని అదనంగా రూ.2 వేల కోట్లు పెంచాలని కేబినెట్ నిర్ణయం
* రూ.4,741 కోట్ల విలువై బాండ్ల విడుదలకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు అనుమతి
* మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెంపు నిర్ణయానికి ఆమోదం
* విశాఖ పట్నం పరదేశి పాలంలోని ఆమోదా పబ్లికేషన్స్‌కు 1.5 ఎకరాల భూ కేటాయింపు రద్దు
* దినపత్రికలకు ఇచ్చే అడ్వర్టైజ్‌మెంట్ల టారిఫ్‌ పెంపు
* స్కూలు ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమీషన్ యాక్ట్‌పై ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం
* యూనివర్సిటీ బోర్డుల్లో సభ్యులుగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సభ్యుల ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం
 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu