ఇప్పటికే.. ఒడిశాలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఇదే సూత్రం దేశం మొత్తం అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం.
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ముందుగానే భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ.. కేసులు భారీగా పెరగడం గమనార్హం. దేశంలో 8వేల కి చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో... లాక్ డౌన్ ని మరికొంత కాలం పొడగిస్తే బాగుంటుందని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలు భావిస్తున్నారు.
Also Read కర్నూలులో విజృంభిస్తున్న కరోనా: కొత్తగా ఐదు కేసులు నమోదు...
ఇప్పటికే.. ఒడిశాలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఇదే సూత్రం దేశం మొత్తం అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం.
లాక్‌డౌన్ పొడిగింపుపై ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్ తన వైఖరిని వెల్లడించలేదు. నేడు ప్రధాని మోదీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తీసుకోనున్నారు. అయితే లాక్‌డౌన్‌ను హాట్‌స్పాట్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నట్టు సమాచారం. పరిశ్రమలు స్కెల్టెన్ స్టాఫ్‌తో నడపాలని సమీక్షలలో జగన్ పదే పదే చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే కుదేలు అవడంతో.. రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రధాని మోదీని జగన్ కోరనున్నారు.