గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై జగన్ వేగంగా స్పందించాలి.. రఘురామకృష్ణంరాజు

By Bukka SumabalaFirst Published Aug 4, 2022, 1:09 PM IST
Highlights

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీద ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. 

ఢిల్లీ : ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ  ఘటనపై  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవీడియో, ఎంపీ గోరంట్ల మాధవ్ చూపించిన వీడియోకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు వీడియోలు మరో రాష్ట్రంలోని ఫోరెన్సిక్  డిపార్ట్మెంట్ కి పంపిస్తే తప్ప  ఘటనలోని అసలు విషయం బయటపడుతుంది. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్ వేగంగా స్పందించాలి. పార్లమెంట్ సాక్షిగా  నన్నే బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలపై మా పార్టీలో ఎవరు స్పందించాలన్నా.. తాడేపల్లి లో ఒక ‘కీ’ ఉంటుంది.  తాడేపల్లి ‘కీ’ ప్రకారమే మా నేతలు నడుచుకుంటారు’ అని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

ఓ మహిళతో నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు గోరంట్ల మాధవ్ తీరుపై మండిపడుతున్నారు. ఎంపీగా ఉంటూ  ఇవేం పనులు అంటూ.. విరుచుకుపడుతున్నారు. మహిళతో నగ్నంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మాధవ్ సీఐగా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళతో ఇలాగే మాట్లాడారు అని ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ అధికారిగా, ఎంపీగా ఆయన తీరు ఎప్పుడూ వివాదాస్పదమేనని పలువురు అంటున్నారు.

అశ్లీల వీడియో వెనుక టీడీపీ కుట్ర: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

కాగా ఈ వీడియోపై హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనను ఇబ్బంది పెట్టి డ్యామేజ్ చేయడానికి కుట్ర చేస్తోందని అన్నారు. తనపై వచ్చిన రాసలీలల వీడియోపై స్పందించిన ఎంపీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ, శివ కృష్ణలు ఓ చెత్త వీడియోను పోస్ట్ చేశారని మండిపడ్డారు. వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు. వారికి దమ్ము, ధైర్యం ఉంటే తనని స్ట్రెయిట్గా ఎదుర్కోవాలని అన్నారు. తాను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారని అన్నారు. ఈ కుట్రలో  అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు కూడా ఉన్నారని తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.

click me!