మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఈడీ షాక్.. రూ.307 కోట్ల ఆస్తులు అటాచ్

Siva Kodati |  
Published : May 11, 2023, 09:47 PM IST
మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఈడీ షాక్.. రూ.307 కోట్ల ఆస్తులు అటాచ్

సారాంశం

మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఈడీ షాకిచ్చింది. సోసైటీ సభ్యులు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ , మణి అక్కినేని ఆస్తులు అటాచ్ చేసింది. 307 కోట్ల ఆస్తులను అటాట్ చేసింది ఈడీ

మంగళగిరిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఆర్ఐఏస్) సభ్యులు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, మణి అక్కినేనిలపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రూ.307.61 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం వెల్లడించింది. తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బ్యాంక్ ఖాతాలు, భూములు, భవనాలు రూ.15.61 కోట్లు వున్నాయని ఓ అధికారి తెలిపారు. 

ఎన్‌ఆర్‌ఐఏఎస్‌ల నిధులకు సంబంధించి నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీకి సంబంధించి నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, మణి అక్కినేని తదితరులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద మంగళగిరి పీఎస్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. సొసైటీ సభ్యులపై ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో అనేక ఇతర ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. ఎన్‌ఆర్‌ఐఏఎస్ సభ్యులు, అధికారులు సొసైటీకి చెందిన భారీ నిధులను మోసపూరితంగా స్వాహా చేసి తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మళ్లించారని ఈడీ విచారణలో వెల్లడైంది.

కోవిడ్-19 సమయంలో, రోగుల నుండి అధిక రేట్లు (ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే చాలా ఎక్కువ) వసూలు చేశారు. ఛార్జీలను ఖాతాల పుస్తకాలలో ఎప్పుడూ నమోదు చేయబడని నగదు రూపంలో వసూలు చేశారు. అనంతరం సొసైటీలోని సభ్యులు, అధికారులు ఆ మొత్తాలను దారి మళ్లించారు. అదేవిధంగా మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ / పీజీ విద్యార్థుల నుంచి అడ్మిషన్ ఫీజును నగదు రూపంలో వసూలు చేశారు. NRIAS ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కూడా ప్రారంభించినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి గతంలో డిసెంబర్ 2022లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే