ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు, చర్చిలో ప్రార్థనలు.. నేడు పులివెందుల బస్టాండ్ ప్రారంభం..

By Sumanth KanukulaFirst Published Dec 24, 2022, 10:38 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటన కొనసాగుంది. నేడు (రెండో రోజు) సీఎం జగన్‌ పులివెందులలో పర్యటించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటన కొనసాగుంది. నేడు (రెండో రోజు) సీఎం జగన్‌ పులివెందులలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకుకు చేరుకున్న సీఎం జగన్.. అక్కడ తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ చర్చిలో జరిగే ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సీఎం జగన్ అక్కడే ఉండనున్నారు. 

మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ పులివెందుల చేరుకుంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు పులివెందుల భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.  మధ్యాహ్నం 1.10 నుంచి 1.20 గంటల వరకు విజయ హోమ్స్‌ వద్ద జంక్షన్‌ను సీఎం జగన్‌ ప్రారభించారు. మధ్యాహ్నం 1.30 నుండి 1.40 గంటల సయమంలో కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 

మధ్యాహ్నం 1.50 నుంచి 2 గంటల సమయంలో సీఎం జగన్ నూతన కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లేఅవుట్‌ను ప్రారంభించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం వంతెనను ఆయన ప్రారంభిస్తారు.

ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు డాక్టర్ వైఎస్ఆర్ బస్టాండ్‌ను ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.35 నుంచి 3.55 గంటల వరకు నాడు నేడు ద్వారా అభివృద్ది చేసిన అహోబిలాపురం పాఠశాలను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.05 నుంచి 4.20 గంటల సమయంలో మురునీటి శుద్ది కేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఇక, సీఎం జగన్ సాయంత్రం 5.40 గంటలకు ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

డిసెంబర్ 25న జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి ఉదయం 8.40 గంటలకు బయలుదేరి 9.05 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. ఉదయం 9.15 నుంచి 10.15 గంటల వరకు సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొంటారు. ఉదయం 10.25 గంటలకు పులివెందులలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

click me!