చంద్రబాబుకు విలువలు, నైతికత లేదు.. రాష్ట్రానికి పట్టిన కర్మ : స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Dec 23, 2022, 07:00 PM IST
చంద్రబాబుకు విలువలు, నైతికత లేదు.. రాష్ట్రానికి పట్టిన కర్మ : స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారామ్. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు మరింత దిగజారుతున్నారని.. ఆయనకు విలువలు, నైతికత అవసరం లేదన్నారు. 

ఏపీ అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరి సభలకు ప్రజలు వస్తున్నారని.. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన కర్మ అని ప్రజలు అనుకుంటున్నారని తమ్మినేని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు మరింత దిగజారుతున్నారని సీతారామ్ దుయ్యబట్టారు. ఆయనకు విలువలు, నైతికత అవసరం లేదని స్పీకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలావుండగా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు మాదిరిగా  తనకు  వేరే రాష్ట్రం, వేరే పార్టీ లేదన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడి మాదిరిగా  ఈ భార్య కాకపోతే  మరో భార్య అని కూడా తాను  అనడం లేదని  సీఎం జగన్  పవన్ కళ్యాణ్ పై  తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడే నివాసం ఉంటానని  ఆయన  తేల్చి చెప్పారు. 

ALso REad: ఈ భార్య కాకపోతే మరో భార్య అనను:కమలాపురంలో పవన్ పై జగన్ ఫైర్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ఉమ్మడి ఏపీకి సీఎంగా  ఉన్న సమయంలో కృష్ణా నది నీళ్లను కడప జిల్లాకు  తీసుకు వచ్చారన్నారు. అంతకు ముందు  ఎంతమంది సీఎంలున్నా కూడా జిల్లాకు కృష్ణా నది నీళ్లు తేలేదన్నారు.  వైఎస్ఆర్  సీఎంగా  ఉన్న సమయంలోనే  కడప జిల్లాలో  ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని  ఆయన చెప్పారు. గతంలో  ఎవరూ కూడా ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదని  ఆయన విమర్శించారు. గాలేరు నగరిని తీసుకువచ్చేందుకు  వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని  ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కృషితోనే గండికోట ప్రాజెక్టు పూర్తైందన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జిల్లాకు చెందిన  ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందని  జగన్  చెప్పారు.

చిత్రావతి  ప్రాజెక్టులో నీరు నిల్వ  చేయలేని పరిస్థితి  నెలకొందన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చిత్రావతి  ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో  నీటిని  నిల్వ చేసినట్టుగా   సీఎం ఈ సందర్భంగా  ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో  రాష్ట్రంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని  విభజన చట్టంలో  పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ విషయాన్నిఅప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలోని  నేతలు కూడా పట్టించుకోలేదని  సీఎం జగన్ విమర్శించారు.కడపలో  రూ. 8800 కోట్లతో  స్టీల్ ప్యాక్టరీని నిర్మించనున్నట్టుగా  సీఎం  ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే