Aadudam Andhra: డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో క్రీడా సంబురాలు నిర్వహిస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాలు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ పోటీలు జరగనుండగా, 122.85 లక్షల మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు.
CM Jagan launch 'Aadudam Andhra': ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మెగా మెగా స్పోర్ట్స్ ఈవెంట్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా యువత ముఖ్యంగా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా సంబురాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఆడుదాం ఆంధ్ర మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ను ప్రారంభించనున్నారు.
మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో 'ఆడుదాం ఆంధ్ర' క్రీడా సంబరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామస్థాయిలో యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని తీర్చిదిద్ది జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ పోటీలు జరుగుతాయి. ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఇప్పటివరకు 122.85 లక్షల మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రూ.12 కోట్లకు పైగా నగదు బహుమతులు, ఇతర అద్భుతమైన బహుమతులను, ప్రశంస పత్రాలు అందజేయనున్నారు.
మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది! 🤩
మీకు అందిస్తున్నాము - ఆడుదాం ఆంధ్రా ✨🔥
ఇక్కడ నమోదు చేసుకోండి 👉 https://t.co/fn0KtZjyED pic.twitter.com/PqhzWcwyra