
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల అమలు.. తదితర అంశాలపై సీఎం జగన్ మోదీతో చర్చించనున్నారు. వీటిపై ప్రధాని మోదీకి సీఎం జగన్ వినతిపత్రం అందజేయనున్నారు. రాష్ట్రానికి ఆర్థిక చేయూత అందించాల్సిందిగా మోదీని సీఎం జగన్ కోరే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్.. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులపై ఆయనతో జగన్ చర్చించనున్నారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది.