4 వేల కి.మీ, 400 రోజుల యాత్ర: యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర

By narsimha lode  |  First Published Dec 28, 2022, 11:34 AM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  వచ్చే ఏడాది జనవరి  27వ తేదీ నుండి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రకు  యువగళం అని పేరు పెట్టారు.  ఈ పాదయాత్ర లోగోను  టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  ఇవాళ ఆవిష్కరించారు.


అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  వచ్చే ఏడాది జనవరి  27వ తేదీ నుండి  రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించనున్నారు.  400 రోజుల పాటు  ఈ పాదయాత్ర సాగనుంది. 4 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర సాగేలా  లోకేష్ రూట్ మ్యాప్ ను సిద్దం చేసుకుంటున్నారు. ఈ పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు. 

2014 ఎన్నికలకు ముందు కూడా  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  సైకిలా యాత్ర  చేయాలని  లోకేష్ ప్లాన్ చేశారు. అయితే  ఆ సమయంలో  చంద్రబాబునాయుడు  పాదయాత్ర చేయడంతో  లోకేష్  తన సైకిల్ యాత్ర  వాయిదా వేసుకున్నారు.  రాష్ట్ర విబజన తర్వాత  ఏపీలో  టీడీపీ అధికారంలోకి వచ్చింది .2019 ఎన్నికల్లో  ఏపీలో  టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.  దీంతో  వచ్చే ఏడాది జనవరి  27వ తేదీ నుండి నారా లోకేష్ పాదయాత్ర చేయాలని ప్లాన్  చేసుకున్నారు.  ఏడాదికి పైగా  ప్రజల్లో ఉండేలా  లోకేష్ ప్లాన్  చేసుకున్నారు. రాష్ట్రంలోని  సుమారు  100 నియోజకవర్గాల గుండా ఈ పాదయాత్ర సాగనుంది.  ఈ పాదయాత్రకు  చెందిన  లోగోను  టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  ఇవాళ  గుంటూరులో  లోగో ఆవిష్కరించారు.

Latest Videos

undefined

2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  అధికారంలోకి రావాలని  టీడీపీ పట్టుదలతో ఉంది.  దీంతో  లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.  వైసీపీ ప్రభుత్వంపై ప్రజల  అభిప్రాయాలను  పాదయాత్ర ద్వారా తెలుసుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. 

 ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  ఏం చేయనుందో   పాదయాత్ర ద్వారా లోకేష్ వివరించనున్నారు. పాదయాత్రలో  ప్రజలు ప్రస్తావించిన అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చేలా  కూడా  టీడీపీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది.  2014 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు నిర్వహించిన పాదయాత్ర సమయంలోనే  రుణ మాఫీ అంశాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల మేనిఫెస్టోలో  ఆ పార్టీ  ఈ అంశాన్ని  పొందుపర్చిన విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది జనవరి  27వ తేదీన  కుప్పం అసెంబ్లీ  నియోజకవర్గం నుండి  లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.  2014కు ముందు  చంద్రబాబునాయుడు  హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో  పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ మాత్రం తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుండి పాదయాత్రకు  శ్రీకారం చుట్టనున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో  కూడా  లోకేష్ పాదయాత్ర  నాలుగు రోజుల పాటు  సాగనుంది.  ఈ మేరకు రూట్ మ్యాప్  ను సిద్దం  చేస్తున్నారు పార్టీ నేతలుగత ఎన్నికల్లో  మంగళగిరి నుండి  పోటీ చేసి  లోకేష్ ఓటమి పాలయ్యాడు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుండి  పోటీకి లోకేష్  రంగం సిద్దం  చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో  అవకాశం దొరికినప్పుడల్లా  నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 


 


 

click me!