అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్‌ రైలు... ప్రారంభించిన సీఎం జగన్

By Arun Kumar PFirst Published Sep 9, 2020, 1:40 PM IST
Highlights

అనంతపురం నుంచి న్యూఢిల్లీకి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకెళ్లనున్న కిసాన్‌ రైలు పట్టాలెక్కింది.

అమరావతి: అనంతపురం నుంచి న్యూఢిల్లీకి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకెళ్లనున్న కిసాన్‌ రైలు పట్టాలెక్కింది. ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం  సీఎం జగన్, రాష్ట్ర మంత్రులు, రైల్వేశాఖ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమంలో హాజయిన కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి రైలును లాంఛనంగా ప్రారంభించారు.  

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వీడియో లింక్‌ ద్వారా సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌, మంత్రులు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్‌ అంగడి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం, రైల్వే అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

read more  పాప భీతి లేకుండా...అంతర్వేది రథానికి నిప్పు పెట్టించింది బాబే: విజయసాయి సంచలనం

ప్రస్తుతం ప్రారంభమయిన ఈ కిసాన్ రైలును అక్టోబర్‌ నుంచి పూర్తిస్థాయిలో నడపనున్నట్లు  రైల్వే అధికారులు తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ లో పండిన పంటలను డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు రవాణా చేసేందుకు ఈ కిసాన్‌ రైలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. ఉల్లి, మిర్చి, అరటి,కూరగాయలతో పాటు పండ్లు, పాలు, మాంసం, చేపలు, రొయ్యలు వంటివాటిని కూడా రవాణా చేసేందుకు ఈ రైలులో ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయి. శీతలీకరణ సదుపాయాలతో అత్యాధునిక బోగీలు ఏర్పాటు చేశారు. రైతుల సౌకర్యార్థం తక్కువ చార్జీలతో సరుకు రవాణా చేసేకునేలా రైల్వేశాఖ కిసాన్‌ రైలును ప్రారంభించింది.   

click me!