పింఛను అర్హత వయసు తగ్గించిన జగన్

By telugu teamFirst Published May 31, 2019, 3:15 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వైఎస్ఆర్ పింఛను పథకాన్ని ప్రారంభించింది. ఎన్టీఆర్‌ భరోసా పేరును వైఎస్సార్‌ పింఛను కానుకగా మార్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వైఎస్ఆర్ పింఛను పథకాన్ని ప్రారంభించింది. ఎన్టీఆర్‌ భరోసా పేరును వైఎస్సార్‌ పింఛను కానుకగా మార్చింది. పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా  ఫించను పెంచిన జగన్... పింఛను అర్హత వయసును కూడా తగ్గించారు.

 పింఛనును రూ.2250లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన తొలి హామీకి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం జీవోను విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి కొత్త పింఛను పథకం అమలులోకి రానుంది. వికలాంగులకు రూ.3వేలు, కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ చేయించుకుంటున్న బాధితులకు రూ.10వేలు పింఛనుగా ఇవ్వనున్నారు. 

వృద్ధాప్య పింఛనుకు అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ఈ పింఛను మొత్తాన్ని జులై 1 నుంచి అందించనున్నారు.

click me!