సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్.. చంద్రబాబుపై విమర్శలు

Published : Mar 20, 2019, 01:08 PM ISTUpdated : Mar 20, 2019, 01:10 PM IST
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్.. చంద్రబాబుపై విమర్శలు

సారాంశం

విజయవాడకు చెందిన లక్కపోగు కోటమ్మకు వచ్చిన సీఎం సహాయ నిధి చెక్ బౌన్స్ అయ్యింది.

విజయవాడకు చెందిన లక్కపోగు కోటమ్మకు వచ్చిన సీఎం సహాయ నిధి చెక్ బౌన్స్ అయ్యింది. సీఎం సహాయనిధి నుంచి తనకు వచ్చిన చెక్ ను బ్యాంకులో విత్ డ్రా చేసుకుందామని వెళ్లిన ఆమెకు నిరాశే ఎదురయ్యింది. చెక్ బౌన్స్ అయ్యిందని ఆ చెక్ ని ఆమెకు బ్యాంకు అధికారులు తిరిగి ఇచ్చారు.

ఆ చెక్ లో ఉన్న వివరాల ప్రకారం.. కోటమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.30వేలు చెక్ ద్వారా అందజేశారు. ఆమె ఎకౌంట్ నెంబర్ 476010200001166. కాగా.. ఆ చెక్ ని నరసారావుపేట యాక్సిస్ బ్యాంక్ లో ఫిబ్రవరి 22వ తేదీన  డిపాజిట్ చేసింది. కాగా.. ఫిబ్రవరి 25వ తేదీ నాటికి చెక్ బౌన్స్ అయ్యింటూ అధికారులు ఆమెకు చెప్పారు. దీంతో బాధితురాలకు షాక్ అయ్యింది.


అయితే.. ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సీఎం సహాయ నిధిలో కనీసం రూ.30వేలు కూడా లేవా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu