మీకు నమ్మకం లేదు, అది చాలా నీచం.. విజయసాయిరెడ్డి కామెంట్స్

Published : Mar 20, 2019, 11:31 AM IST
మీకు నమ్మకం లేదు, అది చాలా నీచం.. విజయసాయిరెడ్డి కామెంట్స్

సారాంశం

మంగళగిరి సీటు గెలుస్తామనే నమ్మకం టీడీపీలో లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 


మంగళగిరి సీటు గెలుస్తామనే నమ్మకం టీడీపీలో లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

‘‘మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే లోకేష్‌ను పోటీ చేయిస్తున్నారు. మంగళగిరిలో ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగుతారన్నమాట. నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రిజైన్ చేయించలేదు చంద్రబాబూ?’’ అంటూ.. విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

మరో ట్వీట్ లో..‘‘ప్రజలను ఓటేయమని ప్రాధేయపడాలి కాని బెదిరించడమేమిటి తుప్పు నాయుడూ? కర్నూలు జిల్లాలో 11 స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించినందుకు అభివృద్ధి పనులన్నీ నిలిపివేశానని చెప్పి మీ నీచత్వాన్ని బయట పెట్టుకున్నారు. మీలాంటి వారిని అధికారానికి దూరంగా తరిమేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.’’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?