తాడేపల్లిలోని గోశాలలో శాంతి యజ్ఞం.. పాల్గొన్న సీఎం జగన్

Published : Jun 04, 2023, 09:33 PM ISTUpdated : Jun 04, 2023, 09:36 PM IST
తాడేపల్లిలోని గోశాలలో శాంతి యజ్ఞం.. పాల్గొన్న సీఎం జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో ఈ శాంతి యజ్ఞం నిర్వహించారు.

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో ఈ శాంతి యజ్ఞం నిర్వహించారు. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహించిన సంగతి  తెలిసిందే. ఈ మహా యజ్ఞంలో సీఎం జగన్‌  పాల్గొన్నారు. 

అయితే మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. వేదపండితులు నిర్వహించిన ఈ శాంతి యజ్ఞంలో సీఎం జగన్‌తో పాటు దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రికి మంత్రి కొట్టు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

మరికొన్ని గంటల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు.. 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు.. భారీ ఏర్పాట్లు
మురసు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం | CM Chandrababu Reviews Flood Situation