హీరోయిన్ అవ్వాలని, త్వరగా ఎదగాలని.. టెన్త్ చదివే కూతురికి ఇంజెక్షన్లు : పోలీసుల అదుపులో తల్లి

కూతురిని హీరోయిన్ చేయాలన్న ఆశతో ఆమె త్వరగా ఎదిగేందుకు గాను హర్మోన్ ఇంజెక్షన్ ఇచ్చిన తల్లిపై విజయనగరం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను విశాఖలోని స్వధార్ కేంద్రానికి తరలించారు. 

Mother arrest over forces Growth hormone injections to minor to make her an actor in AP ksp

కూతురిని హీరోయిన్ చేయాలన్న ఆశతో హర్మోన్ ఇంజెక్షన్ ఇచ్చిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. సినిమాల మీద మోజుతో ఎవడో దారినపోయే దానయ్య చెప్పాడని కూతురిపై ఏ తల్లి చేయని ప్రయోగం చేసిందామె. విజయనగరానికి చెందిన మహిళకు కూతురు పుట్టాక భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ రెండో భర్త పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మొదటి భర్త ద్వారా పుట్టిన చిన్నారితో ఒంటరిగా వుంటోంది. పాపను హాస్టల్‌లో వుంచి చదివిస్తోంది. 

ఈ మధ్యే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు రోజు ఆమె ఇంటికి వస్తూ వెళ్తూ వుంటాడు. అయితే వేసవి సెలవులు కావడంతో బాలిక ఇంటికి వచ్చింది. ఎవరెవరో ఇంటికి వస్తూ వుండటంతో పాప తల్లిని నిలదీసింది. అయినా ఆమె ప్రవర్తన మార్చుకోలేదు. చివరికి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న దుర్మార్గుడు బాలికపై కన్నేశాడు. చిన్నారిలో హీరోయిన్ అయ్యే లక్షణాలు వున్నాయని శరీరం ఎదిగినట్లుగా కనిపిస్తే తనకు తెలిసినవాళ్లతో ఛాన్స్ ఇప్పిస్తానని మాయ మాటలు ఇచ్చారు. ఇది నిజమని నమ్మిన మహిళ.. త్వరగా ఎదిగేందుకు అతను తెచ్చి ఇచ్చిన ఇంజెక్షన్లను పాపకు బలవంతంగా ఇస్తూ వస్తోంది. 

Latest Videos

అయితే కొన్ని రోజులకు ఇంజెక్షన్లు వికటించి.. పాపలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఆరోగ్యం పాడైపోవడంతో తల్లి పెట్టే చిత్రహింసలు భరించలేకపోయింది. దీంతో 1098 నెంబర్‌కు ఫోన్ చేసి చైల్డ్ లైన్ సిబ్బందికి తన పరిస్ధితిని వివరించింది చిన్నారి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. పాపను విశాఖలోని స్వధార్ కేంద్రానికి తరలించారు. 

vuukle one pixel image
click me!