ఒక్కసారి వైసిసి గేట్లెత్తి చూడండి... రివర్స్ జంపింగ్ లు ఖాయం: బుద్దా సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Jun 05, 2020, 07:32 PM IST
ఒక్కసారి వైసిసి గేట్లెత్తి చూడండి... రివర్స్ జంపింగ్ లు ఖాయం: బుద్దా సంచలనం

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే టిడిపి నుండి భారీస్థాయిలో చేరికలు వుంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని... కానీ అలా చేస్తే వారి అంచనాలు తలకిందులవడం ఖాయమని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపేర్కొన్నారు.

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే టిడిపి నుండి భారీస్థాయిలో చేరికలు వుంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని... కానీ వారి అంచనాలు తలకిందులవడం ఖాయమని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపేర్కొన్నారు. టిడిపి నుండి వైసిపిలోకి  కాదు  వైసిపి నుండే ఎంపీలు, ఎమ్మెల్యేలు టిడిపిలో చేరతారంటై వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''పారిశ్రామిక వేత్తలు క్యూ లో ఉన్నారా?ఎక్కడో చెప్పండి వెళ్లి మజ్జిగ ప్యాకెట్లు అయినా ఇస్తాం సాయిరెడ్డి గారు.తండ్రి అధికారంలో ఉండగానే  సూట్ కేస్ కంపెనీలకు జగన్ గారు గాడ్ ఫాదర్,మనీ ల్యాండరింగ్ కి జగన్ గారు రింగ్ మాస్టర్,క్విడ్ ప్రో కో కి జగన్ గారు కింగ్ పిన్''
 అంటూ ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు. 

''పారిశ్రామికవేత్తలను జైలు పాలు చేసిన జైలు పక్షులను చూసి పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్న మాట వాస్తవమే సాయిరెడ్డి గారు'' అంటూ ఎద్దేవా చేశారు. 

''ప్ర‌కాశం బ్యారెజి గేటుకి అడ్డంగా బోటుప‌డితే తీయ‌లేనోళ్లు, తాము గేటు తీస్తే టీడీపీ ఖాళీ అంటున్నారు.వైఎస్సార్సీపీ గేటు ఒక్క‌సారి తీయండి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వ‌రకూ వైకాపా ఎంపీ,ఎమ్మెల్యేలు ఎంత‌మంది జంప్ అవుతారో చూడండి'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

read more   కుప్పంలో బహిరంగ చర్చ.. బాబు వచ్చినా సరే, లోకేశ్ అయినా ఫర్వాలేదు: శ్రీకాంత్ రెడ్డి
 
''పంచభూతాలను దోచుకోవడం వైఎస్ జగన్ నైజం.ఇప్పుడు ఆయన కన్ను పాదయాత్రలో చూసిన మాన్సాస్ ట్రస్ట్ భూముల పై పడింది.రాజధాని పేరుతో ఎంపీ విజయసాయి రెడ్డి డైరెక్షన్ లో మాన్సాస్ ట్రస్టును బ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కుట్రకి తెరలేపారు'' అని మండిపడ్డారు. 
 
''అవినీతి అనే పదంతో పరిచయంలేని వ్యక్తి అశోక గజపతి రాజు గారు.ఇప్పటి వరకూ ఆయన పై ఆరోపణ చేసే సాహసం చేసిన మొదటి వ్యక్తి మీరే సాయి రెడ్డి గారు.మీరు వేలు పెట్టే వరకూ మాన్సాస్ ట్రస్ట్ లో ఒక్క వివాదం కూడా లేదు అదీ అశోక్ గజపతి రాజు గారి విశ్వసనీయత'' అపి తెలిపారు. 
 
''సమాధానం కోసం ఎదురు చూసే దౌర్బాగ్యం మీకు ఎందుకు? అధికారంలో ఉన్నది మీరే ఆరోపణలు కాదు దమ్ముంటే  ఆధారాలు బయటపెట్టండి'' అని వెంకన్న సవాల్ విసిరారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!