సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..

Published : May 08, 2023, 05:34 PM IST
సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సిక్కుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సిక్కుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం జగన్‌ను ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలిశారు. ఈ సందర్బంగా వారు పలు అంశాలను సీఎం జగన్‌తో చర్చించారు. ఈ క్రమంలోనే వారు చేసిన పలు అభ్యర్థనలపై సీఎం జగన్ సానుకూలంగా  స్పందించారు. సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి రోజున సెలవు ఇవ్వడానికి అంగీకరించారు. వచ్చే కేబినెట్ భేటీలో ఇందుకు సంబంధించి తీర్మానం కూడా చేస్తామని చెప్పారు. 

గురుద్వారాల్లో పూజారులైన గ్రంధీలకు పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. సిక్కు మైనార్టీ విద్యాసంస్థ ఏర్పాటుకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను తొలగింపుకు అంగీకరించారు. సిక్కులు పారిశ్రామికంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu