విశాఖకు జైకొట్టిన శ్రీ భరత్: బాలకృష్ణ కుటుంబంలో చిచ్చురేపిన జగన్...?

By telugu teamFirst Published Dec 26, 2019, 1:40 PM IST
Highlights

లేటెస్ట్ గా సీఎం జగన్ విశాఖ  రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయం... టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఇంట్లో రాజకీయంగా చిచ్చుపెట్టిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.  

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా రాజధాని చుట్టూనే తిరుగుతుంది. అమరావతి ప్రాంత ప్రజలు తమకు అన్యాయం జరుగుతుందని నిరసన తెలుపుతూ రోడ్డెక్కితే... విశాఖపట్నం వాసులేమో విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా స్వాగతిస్తున్నారు. 

ఈ నిర్ణయం వల్ల ఇరు ప్రాంతాల్లో రాజకీయ నాయకులూ పార్టీలకతీతంగా ఇబ్బందులు పడుతున్నారు.  ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నాయకులు ముందుకు సాగవలిసి ఉంటుంది.

ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తలనొప్పిగా తయారయ్యింది. అమరావతి పరిసర ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఇబ్బంది పడుతుంటే విశాఖ ప్రాంతంలో టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు.  

Also read: మూడు రాజధానుల చిచ్చు:టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రహమాన్ రాజీనామా

ఇక లేటెస్ట్ గా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం... టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఇంట్లో రాజకీయంగా చిచ్చుపెట్టిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.  టీడీపీలో చంద్రబాబు తరువాతి స్థానంలో ఉన్న లోకేశ్ బాలకృష్ణకు స్వయానా అల్లుడు.

చంద్రబాబు, లోకేశ్ ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ మాత్రం ఇందుకు భిన్న వైఖరి తీసుకున్నాడు. 

విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిన శ్రీభరత్, సీఎం జగన్ విశాఖ ను రాజధానిగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయానికి జై కొట్టారు. దీనిపై విశాఖ టీడీపీ నేతలు, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీభరత్ పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. 

ఇప్పటికే రాజధాని అంశంలో విశాఖ టీడీపీ నేతలు చీలిపోయినట్టు మనకు అర్థమవుతూనే ఉంది. విశాఖ టీడీపీ నేతలు బాహాటంగానే జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. 

విశాఖ  రాజధాని విషయంలో చంద్రబాబు, లోకేశ్ ల నిర్ణయాన్ని విశాఖలోని మిగతా టీడీపీ నాయకుల తరహాలోనే శ్రీభరత్ కూడా వ్యతిరేకిస్తున్నారా ? లేదా పార్టీలో తన ముద్ర వేయడానికి ఇది ఒక అందివచ్చిన అవకాశంగా శ్రీభరత  భావిస్తున్నాడా అనే చర్చ జోరందుకుంది. 

అయితే విశాఖ ప్రజల మనోభావాలను, వారి అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకునే శ్రీభరత్ ఈ విషయంలో ఇలా టీడీపీ నేతల సమావేశానికి హాజరయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

Also read: అమరావతికి వైఎస్ జగన్ టోకరా: అసలు వాస్తవం ఇదీ...

దీనికి తోడుగా, సమావేశానికి వెళ్లడానికి ముందు ఆయన బాలకృష్ణను గని చంద్రబాబు నాయుడును గని సంప్రదించే ఉంటారని కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా శ్రీభరత్ ఒకింత గట్టిగానే మాట్లాడారు. శ్రీభరత్ కూడా పొలిటికల్ గా బాగా అంబిషియస్. గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎప్పటి నుండో రంగం సిద్ధం చేసుకున్నట్టు టాక్. 

సో ఇప్పుడు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం... బాలకృష్ణ ఇంట్లో రాజకీయంగా చిచ్చుపెట్టేలాగానే కనిపిస్తోంది.

click me!