విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్

By narsimha lodeFirst Published Feb 3, 2020, 11:57 AM IST
Highlights

ఏపీ సీెం వైఎస్ జగన్ విశాఖ శారదా పీఠం వార్షిక కార్యక్రమంలో సోమవారం నాడు పాల్గొన్నారు. సీఎం హోదాలో జగన్ శారదా పీఠం కార్యక్రమంలో పాల్గొనడం ఇది రెండోసారి.


విశాఖపట్టణం:  విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు పాల్గొన్నారు.
విశాఖ శారదా పీఠం వార్షికోత్సవం ముగింపు కార్యక్రమాన్ని  పురస్కరించుకొని సోమవారం నాడు వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు విశాఖ విమానాశ్రయంలో వైసీపీనేతలు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మంత్రులు జగన్‌కు విమానాశ్రయంలో  ఘనంగా స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుండి జగన్ నేరుగా  శారదా పీఠానాకి చేరుకొన్నారు. విశాఖ శారదా పీఠానికి సీఎం జగన్ చేరుకోగానే వేద పండితులు సీఎంకు పూర్ణ కుంభంతో  స్వాగతం పలికారు.

శారద పీఠంలో సుమారు రెండు గంటల పాటు సీఎం జగన్ గడపనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  జగన్ శారద పీఠాన్ని సందర్శించుకొన్నారు. శారద పీఠాధిపతిని దర్శించుకొన్న  తర్వాతే జగ,న్..... మంత్రుల ప్రమాణానికి ముహుర్తాన్ని నిర్ణయం తీసుకొన్నారు.

శారదా పీఠాధిపతి సూచించిన ముహుర్తం మేరకే జగన్  కేబినెట్ ను విస్తరించినట్టుగా అప్పట్లో  ప్రచారం సాగింది.మరో వైపు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సీఎం జగన్ సీఎం హోదాలో రెండోసారి విశాఖలోని శారదా పీఠాన్ని సోమవారం నాడు సందర్శించుకొన్నారు.  

శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్‌ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. విశ్వశాంతి యాగంలో జగన్ పాల్గొన్నారు. శారదా పీఠంలో  కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సీఎం జగన్ సోమవారం నాడు మధ్యాహ్నం తర్వాత అమరావతికి తిరిగి వెళ్తారు.

 
 

 

click me!