
చంద్రబాబు పూర్తిగా బరితెంగించేసినట్లు కనబడుతోంది. తమ నియెజకవర్గాల్లో అభివృద్ది పనుల గురించి, నిధుల విడుదల గురించి వైసీపీ ఎంఎల్ఏలు తనను కలసినపుడు చంద్రబాబు మాటలకు వారు అవాక్కయ్యారు. ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గాలకు నేరుగా నిధులు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది. ఎంఎల్ఏల ద్వరా చేయించాల్సిన పనులను, వారి ఖాతాలకు విడుదల చేయాల్సిన నిధులను ఆయా నియోజవర్గాల్లో తమ పార్టీ నేతల ద్వారానే చేయిస్తున్నట్లు నిసిగ్గుగా చంద్రబాబు చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది.
గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచంగా చెప్పినట్లు లేదు. ప్రతిపక్ష ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో అభివృద్ది చేయటం ఇష్టం లేకపోతే ఏదో కథలు చెప్పి పంపేసేవారు. అంతే కాని మీ నియోజకవర్గాల్లో పనులను చేయించమని, ఒకవేళ చేయించాల్సి వచ్చినా తమ నేతల ద్వరానే నిధులను మంజూరు చేయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు తప్ప మరొకరు లేరు. తమ డిమాండ్ల విషయంలో చంద్రబాబు చెప్పిన సమాధానం విన్న శాసనసభ్యులు కూడా నివ్వెరపోయారు.
అయితే, చంద్రబాబు చెప్పిన సమాధానాన్ని ప్రజాస్వామ్య వాదులెవరు కూడా హర్షించరు. నియోజకవర్గాల అభివృద్ధి అనేది నిరింతర ప్రక్రియ. ఈ రోజు ఒక పార్టీకి చెందిన ఎంఎల్ఏ ఉంటే రేపు మరో పార్టీకి చెందిన వారు ఎంఎల్ఏగా ఎన్నికవుతారు. అంతేకానీ బ్రతికినంత కాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉండరు, టిడిపి వారే ఎంఎల్ఏలుగా ఉండబోరు. ఈ విషయం గతంలో ఎన్నో మార్లు రుజవైంది కూడా. 40 ఏళ్ళ ఇండస్ట్రి చంద్రబాబుకు ఇంకెవరో చెప్పాల్సిన అవసరమే లేదు.
అయినా చంద్రబాబు ఆ విధంగా చెప్పారంటే, ప్రతిపక్షాన్ని ఎంత హీనంగా చూస్తున్నారో అర్ధమవుతోంది. రేపటి రోజున జరిగే ఎన్నికల్లో ఖర్మకాలి టిడిపి ఓటమిపాలైతే, ఇపుడు అధికార పార్టీలో ఓవర్ యాక్షన్ చేస్తున్న వారి భవిష్యత్తు ఎలాగుంటుందో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.