సభకు హాజరుకానప్పుడు.. సభ్యత్వం ఎందుకు: వైసీపీపై చంద్రబాబు ఫైర్

By sivanagaprasad KodatiFirst Published Sep 7, 2018, 10:28 AM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. ప్రతిపక్షాలు లేకుండా అసెంబ్లీ జరుగుతుండటంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. ప్రతిపక్షాలు లేకుండా అసెంబ్లీ జరుగుతుండటంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రాథమిక బాధ్యతలను వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ విస్మరించిందని వ్యాఖ్యానించారు. సభకు హాజరుకానప్పుడు సభ్యత్వం వృథా అన్నారు.

శాసనసభ సమావేశాలకు హాజరుకావడం సభ్యుడి ప్రాథమిక బాధ్యత అన్నారు. ప్రశ్నలు వేయడం, స్వల్పకాలిక, ధీర్ఘకాలిక చర్చలు అర్థవంతంగా జరగాలన్నారు. కౌన్సిల్‌లో రాజధాని నిర్మాణంపై జరిగే చర్చలో అందరరూ పాల్గొనాలని సీఎం సూచించారు. ప్రతిపక్షం లేకపోయినా సభ బాగా జరిగిందనే పేరు రావాలని ఆకాంక్షించారు. జరుగుతున్న ప్రతి అంశాన్ని  ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు వారి నిరసన తెలియజేస్తారని ముఖ్యమంత్రి అన్నారు.
 

click me!