కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న చంద్రబాబు

Published : Sep 13, 2018, 03:43 PM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న చంద్రబాబు

సారాంశం

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. సాయంత్రం  ప్రారంభం కానున్నబ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు.

తిరుమల: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. సాయంత్రం  ప్రారంభం కానున్నబ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు. తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో ఏకే సింఘాల్ , జేఈఓ శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.  

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 7 గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేస్తారు. ఆ తర్వాత రంగనాయకుల మంటపంలో టీటీడీ ముద్రించిన 2019 సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరిస్తారు. అనంతరం పెద్దశేషవాహన సేవలో కుటుంబ సమేతంగా పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి శుక్రవారం తిరిగి అమరావతి ప్రయాణమవుతారు.  

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు