ముగ్గురిని బలితీసుకున్న విద్యుత్ షాక్

Published : Sep 13, 2018, 03:22 PM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
ముగ్గురిని బలితీసుకున్న విద్యుత్ షాక్

సారాంశం

వినాయకచవితి పర్వదినాన అంతా సంబరాలు చేసుకుంటే ఆ ఇంట్లో మాత్రం విషాదం చోటు చేసుకుంది. బంధువుల గృహప్రవేశానికి హాజరై వారికి సాయం చేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

గుంటూరు: వినాయకచవితి పర్వదినాన అంతా సంబరాలు చేసుకుంటే ఆ ఇంట్లో మాత్రం విషాదం చోటు చేసుకుంది. బంధువుల గృహప్రవేశానికి హాజరై వారికి సాయం చేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏసు(26) తన పిల్లలు సాల్మన్ రాజు(5), ఎస్తేరు(3)తో కలిసి ప్రత్తిపాడు మండలం గనికపూడిలో బంధువుల గృహప్రవేశానికి హాజరయ్యాడు. బుధవారం గృహప్రవేశం పూర్తయిన తర్వాత నూతన ఇంటిలోకి కేబుల్ వైరు లాగుతున్న ఏసు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. 

తండ్రి విద్యుత్ షాక్ కి గురయ్యాడని తెలియని ఆ చిన్నారులు తండ్రిని పట్టుకోవడంతో వారు కూడా విద్యుత్ షాక్ గురయ్యారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొత్తింట్లో పిల్లలతో కలిసి సందడిగా గడిపిన ఏసు కుటుంబం ఇలా మృత్యువాత పడటంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్