కాంగ్రెస్‌కు షాక్.... పవన్ కళ్యాణ్ తో మాజీ ఎమ్మెల్యే భేటీ

By Arun Kumar PFirst Published Sep 13, 2018, 3:03 PM IST
Highlights

ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అసెంబ్లీ రద్దవడంతో తెలంగాణ లో ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ  భారీగా వలసలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఢీలాపడిపోయిన ఏపి కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్మెల్యే షాకివ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆ మాజీ ఎమ్మెల్యే కదలికలు ఉండటం ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా రాజోల మాజీ ఎమ్మెల్యే రాపాల వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే ఈయన బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను హైదరాబాద్ లో కలిశారు. అయితే పవన్ ని మర్యాద పూర్వకంగానే కలిశానని రాపాల చెబుతున్నప్పటికీ...రాపాల జనసేనలో చేరడం ఖాయమైనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. రాజోల నుండి జనసేన అభ్యర్థిగా రాపాల పేరు ఖరారైనట్లు కూడా వారు ప్రచారం చేస్తున్నారు.

 జనసేన పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, వైసిపిలకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పటినుండే బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకొడానికి పథకాలు రచించింది. ఇందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లా రాజోల మాజీ ఎమ్మెల్యే రాపాలతో పవన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వారం రోజుల వ్యవధిలోనే వీరిద్దరు రెండు సార్లు బేటీ కావడం ఈ ప్రచారానికి బలపరుస్తోంది. 

click me!