నీ తండ్రిది సోడాల వ్యాపారం.. నువ్వు ఇలాంటి స్కూల్‌కా : తోటి విద్యార్థుల హేళన, మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

By Siva KodatiFirst Published Mar 22, 2022, 7:34 PM IST
Highlights

తోటి విద్యార్ధుల హేళనతో మనస్తాపానికి గురైన ఓ పదో తరగతి విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బాలిక మృతదేహంతో స్కూల్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

చిత్తూరు జిల్లా (chittoor district) పలమనేరులో (palamaner) దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి (suicide) పాల్పడింది. పలమనేరులోని బ్రహ్మర్షీ అనే ప్రైవేట్ స్కూల్‌లో మిస్బా అనే విద్యార్ధిని పదో తరగతి చదువుతోంది. అమ్మాయి తండ్రి సోడాల వ్యాపారి కావడంతో తోటి విద్యార్ధులు హేళన చేశారు. సోడా వ్యాపారం చేసే వాళ్లకి ఇలాంటి స్కూల్ అవసరమా అంటూ ఎగతాళి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తోటి పిల్లల హేళన చేయడంతో తమ బిడ్డను స్కూల్ నుంచి కూడా పంపేశారని చెబుతున్నారు. దీంతో మిస్బా మృతదేహంతో స్కూల్ దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులు , బంధువులు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!