కర్నూల్ జిల్లా వైఎస్ఆర్‌సీపీలో ఆధిపత్యపోరు: ఆర్ధర్, బైరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ

By narsimha lodeFirst Published Feb 3, 2021, 3:58 PM IST
Highlights

జిల్లాలోని వైఎస్ఆర్‌సీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కర్నూల్: జిల్లాలోని వైఎస్ఆర్‌సీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్ధర్, నందికొట్కూర్ వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్డ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలు కుర్చీలతో కొట్టుకొన్నారు.సమావేశానికి హాజరైన మంత్రులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నించారు.

ఈ నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా ఆదిపత్యపోరు సాగుతోంది. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధు ఎంపిక సమయంలో ఘర్షణ చోటు చేసుకొంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జయరాం, ఎంపీ వేమిరెడ్డి లు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు.

గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఆర్ధర్ పోటీ చేసి విజయం సాధించారు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గానికి బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డిని ఇంచార్జీగా వైసీపీ నియమించింది. ఈ ఇద్దరి మధ్య కొంత కాలంగా సఖ్యత లేకుండా పోయింది. దీంతో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు బహిరంగంగానే సవాల్ చేసుకొంటున్నాయి. 
 

click me!