ఆలయాలపై దాడులు.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించండి: రాజ్యసభలో జీవీఎల్

Siva Kodati |  
Published : Feb 03, 2021, 03:55 PM IST
ఆలయాలపై దాడులు.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించండి: రాజ్యసభలో జీవీఎల్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించేలా చూడాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని పలు దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించేలా చూడాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఏపీలో జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే వీటికి కారణమని జీవీఎల్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో జరుగుతున్న దాడులను సభతో పాటు దేశం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని నరసింహారావు తెలిపారు.

ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల జరిగిన ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని జీవీఎల్ గుర్తుచేశారు.

గత ఏడాదిన్నర కాలంలో ఏపీలో ఈ తరహా దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోవటమే ఇందుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఘటనలు రాష్ట్రంలోనేగాక దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను బాధిస్తాయని నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఏపీలో 'మినీ సమ్మర్', తెలంగాణలో 'మినీ వింటర్'
Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?