త్వరలో చంద్రబాబు పర్యటన... కొవ్వూరు టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు, బుచ్చయ్య ముందే బాహాబాహీ

Siva Kodati |  
Published : Nov 26, 2022, 07:14 PM IST
త్వరలో చంద్రబాబు పర్యటన... కొవ్వూరు టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు, బుచ్చయ్య ముందే బాహాబాహీ

సారాంశం

త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తుండగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సభా వేదికపైకి వచ్చే వారి జాబితాలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు రగిలిపోయారు.

తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళితే... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబర్ 1న కొవ్వూరు పర్యటనకు రానున్నారు. దీంతో ఆయన పర్యటన ఏర్పాట్లపై సమీక్షించడానికి కొవ్వూరు నియోజకవర్గ నేతలు శనివారం సమావేశమయ్యారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఇద్దరు సభ్యుల కమిటీ సమావేశమైంది. ఇందులో సుబ్బరాయ చౌదరి, రామకృష్ణలు సభ్యులుగా వున్నారు. అయితే సభా వేదికపైకి వచ్చే వారి జాబితాలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు రగిలిపోయారు. తక్షణం ఆయనను వేదికపైకి పిలవాలంటూ జవహర్ అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సర్దిచెప్పేందుకు బుచ్చయ్య ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Also Read:బెజవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల భేటీ.. ఎంపీ కేశినేని నాని డుమ్మా, వరుసగా రెండోసారి

మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ నియోజకవర్గాల్లోని తెలుగుదేశం నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వీటిలో డోన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మన్నె సుబ్బారెడ్డిని నియమిండంతో కేఈ ప్రభాకర్ వర్గం అలిగింది. ఈ నేపథ్యంలో తరచూ ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?