కృష్ణా జిల్లా: కోడిపందాల్లో వాగ్వాదం.. రణరంగమైన బరి

By Siva KodatiFirst Published Jan 15, 2021, 8:39 PM IST
Highlights

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల చెరువు సమీపంలో కోడిపందాల బరి రణరంగంగా మారింది. కోడి పందాల బరుల వద్ద ఘర్షణ చెలరేగి రెండు వర్గాలు కొట్టుకున్నాయి.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల చెరువు సమీపంలో కోడిపందాల బరి రణరంగంగా మారింది. కోడి పందాల బరుల వద్ద ఘర్షణ చెలరేగి రెండు వర్గాలు కొట్టుకున్నాయి.

అత్కూర్, కేతనకొండ గ్రామాల మధ్య వాగ్వాదం చెలరేగి కుర్చీలతో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మరోవైపు న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా సరే ఏపీలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా భారీ ఎత్తున కోడి పందాలు సాగుతున్నాయి. ఇక ఈ కోళ్ల పందాలలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

అలానే భారీగా పందెంరాయుళ్లు బరుల వద్ద సందడి చేస్తున్నారు.  పోలీసులు పండుగకు కొద్ది రోజుల ముందు నుండి కోడి కత్తులను స్వాధీనం చేసుకుని అప్పటికే ఏర్పాటు చేసిన బరులను పెద్ద సంఖ్యలో ధ్వంసం చేసారు. అయినా సరే పందెం రాయుళ్ళు ఎక్కడా తగ్గకుండా పందేలకు వెళ్ళడం గమనార్హం.

click me!