నరసరావుపేటలో వైసీపీ-టీడీపీ ఘర్షణ: రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు

By sivanagaprasad kodatiFirst Published Jan 25, 2019, 7:46 AM IST
Highlights

గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోడెల శివరాం జన్మదిన వేడుకల్లో భాగంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందుగా ర్యాలీ వెళ్లింది. 

ఆ సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా వైసీపీ శ్రేణులు సైతం నినాదాలు చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణ తీవ్రంగా మారి ఇరువర్గాలు పరస్పరం గాల్లోకి రాళ్లు రువ్వుకున్నాయి.

ఈ ఘటనలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
 
click me!