కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు.. పోలవరం, రాయలసీమపై చర్చ

By Siva KodatiFirst Published Jul 22, 2021, 9:56 PM IST
Highlights

పోలవరం నిర్వాసితులు , ముంపు గ్రామాలు తదితర అంశాలను కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు వివరించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆర్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటివరకూ సాయం అందలేదని ఆయన మంత్రి దృష్టికి తెలిపారు

ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సారథ్యంలో బృందం గురువారం కలిసింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును సమీక్షించిన వివరాలు, పోలవరం నిర్వాసితులు , ముంపు గ్రామాలు తదితర అంశాలను మంత్రికి వివరించారు సోము వీర్రాజు. ఆర్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటివరకూ సాయం అందలేదని ఆయన మంత్రి దృష్టికి తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్ట్‌ల స్టేటస్‌లను కూడా సోము వీర్రాజు వివరించారు.

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్, మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు జరిపారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చొరవిచూపి ఆయా ప్రాంతానికి న్యాయం చేయాలని వీర్రాజు కేంద్ర మంత్రిని కోరారు. విజయవాడలో జరిగిన నీటి రంగ నిపుణులు రౌండ్ టేబుల్ సమావేశంలో  వారి సలహాలు, సూచనల్ని షెకావత్‌కు వివరించారు సోము వీర్రాజు. అలాగే ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసిన బృందంలో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సి.ఎం.రమేష్ , టి.జి.వెంకటేష్ , ఙివిల్ నరసింహారావు తదితరులు వున్నారు. 

click me!