ఏపీ: రోజువారీ కేసుల్లో భారీ తగ్గుదల, కొత్తగా 1843 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Jul 22, 2021, 06:29 PM ISTUpdated : Jul 22, 2021, 06:30 PM IST
ఏపీ: రోజువారీ కేసుల్లో భారీ తగ్గుదల, కొత్తగా 1843 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 1843 కరోనా కేసులు నమోదవ్వగా.. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,199 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 23,571 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1843 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,45,697కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,209కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 2, ప్రకాశం 3, కర్నూలు 2, కృష్ణ 1, నెల్లూరులో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,199 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,08,917కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 70,727 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,39,09,363కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 23,571 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 69, చిత్తూరు 301, తూర్పుగోదావరి 222, గుంటూరు 126, కడప 128, కృష్ణ 157, కర్నూలు 24, నెల్లూరు 203, ప్రకాశం 232, శ్రీకాకుళం 33, విశాఖపట్నం 84, విజయనగరం 29, పశ్చిమ గోదావరిలలో 235 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

 

PREV
click me!

Recommended Stories

పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu
300 ఎక‌రాల్లో, రూ. 8,175 కోట్ల పెట్టుబ‌డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ గ్రామం రూపు రేఖ‌లు మార‌డం ఖాయం