
బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని శాంతి థియేటర్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమాను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్క్రీన్ దగ్గర డ్యాన్స్ చేస్తున్న అభిమానులను నిర్వాహకులు అడ్డుకున్నారు.దీంతో థియేటర్ యాజమాన్యం, ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు శాంతి థియేటర్ వద్దకు చేరుకుని ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా.. గతంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు కోసం ఖుషి చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రధాన థియేటర్స్ లో ఖుషి రీరిలీజ్ హంగామా కనిపిస్తోంది. ఖుషి హంగామా డిసెంబర్ 31 రాత్రి రెట్టింపు కానుంది. న్యూ ఇయర్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఖుషి చిత్రంతో సంబరాలు చేయనున్నారు. ఖుషి చిత్రాన్ని నిర్మించిన ఏఎం రత్నం నిర్మాణంలోనే పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు.
ALso REad: 'ఖుషి' రీ రిలీజ్ చూసిన అకిరా.. ఫ్యాన్స్ తో కలిసి థియేటర్ సందడి, పవన్ కొడుకు స్టైలిష్ లుక్ వైరల్
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో జల్సా చిత్రాన్ని ఖుషి నైజాం ఏరియాలో అధికమించింది. జల్సా 1.25 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టగా.. ఖుషి చిత్రం 1.30 కోట్లు రాబట్టింది. అన్ని షోలు ముగిసే సమయానికి జల్సా రికార్డులని ఖుషి అధికమిస్తుంది అని ట్రేడ్ అంచనా వేస్తున్నారు