టికెట్ కోసం చంద్రబాబుని కలిసిన సినీ నిర్మాత

By ramya NFirst Published 22, Feb 2019, 9:49 AM IST
Highlights

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు ఎగపడుతున్నారు.

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు ఎగపడుతున్నారు. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉండటంతో.. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ముఖ్య పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా.. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే పనిలో పడ్డారు. కాగా.. సినీ నిర్మాత, చిత్తూరుు ఎంపీ శివప్రసాద్ పెద్ద అల్లుడు వేణుగోపాల్ గురువారం చంద్రబాబుని కలిశారు. తనకు సత్యవేడు టికెట్ కేటాయించాలని కోరారు. తాను ఇప్పటి వరకు పార్టీ కోసం ఎంతలా కృషి చేశానో ఈ సందర్భంగా వేణుగోపాల్ చంద్రబాబుకి వివరించారు.

తన బయోడేటాను పార్టీ అధినేతకు అందించారు. కాగా, ఎంపీ శివప్రసాద్‌ రెండో అల్లుడు నరసింహ ప్రసాద్‌కు రైల్వేకోడూరు అభ్యర్థిత్వం ఖరారైంది.

Last Updated 22, Feb 2019, 9:49 AM IST