కేసీఆర్ కి అసూయ, ద్వేషం.. చంద్రబాబు

By ramya NFirst Published 22, Feb 2019, 9:31 AM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు.

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ఏపీపై కేసీఆర్ కి అసూయ, ద్వేషం ఉన్నాయన్నారు. శుక్రవారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంపై మోదీ, అమిత్‌ షా కక్షగట్టారన్నారు. 

కేసుల మాఫీ కోసం జగన్ లాలూచీ పడ్డాడన్నారు. కుట్రలు, కుతంత్రాల జోడీ బీజేపీ, వైసీపీ అని చంద్రబాబు అన్నారు. ఉగ్రదాడులపై గతంలో సీఎంగా మోదీ వ్యాఖ్యలనే ప్రస్తావించామని, మన్మోహన్‌పై మోదీ ఏం మాట్లాడారో అదే గుర్తు చేశామని చంద్రబాబు అన్నారు. దీనిపై బీజేపీ నేతల రాద్ధాంతం అనవసరమని, టీడీపీ చేసింది మోసం కాదు.. బీజేపీ చేసింది నమ్మకద్రోహమని సీఎం అన్నారు. ఎవరు దేశానికి ద్రోహం చేశారో ప్రజలే తేలుస్తారని చంద్రబాబు అన్నారు.

Last Updated 22, Feb 2019, 9:31 AM IST