నాలుగేళ్ల క్రితమే పోరాటం చేస్తే హోదా వచ్చేది: బాబుపై ఆర్ నారాయణ మూర్తి సెటైర్

Published : Nov 16, 2018, 08:29 PM IST
నాలుగేళ్ల క్రితమే పోరాటం చేస్తే హోదా వచ్చేది: బాబుపై ఆర్ నారాయణ మూర్తి సెటైర్

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబుపై సినీనటుడు ఆర్. నారాయణమూర్తి సెటైర్లు వేశారు. కేంద్రంపై చంద్రబాబు చేస్తున్న పోరాటం నాలుగేళ్ల క్రితమే చేసి ఉంటే  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబుపై సినీనటుడు ఆర్. నారాయణమూర్తి సెటైర్లు వేశారు. కేంద్రంపై చంద్రబాబు చేస్తున్న పోరాటం నాలుగేళ్ల క్రితమే చేసి ఉంటే  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమరయాత్రలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి హోదా ఇచ్చేవారికే ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. 

ఏపీకి మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన నేతలు ఏమైపోయారని ప్రశ్నించారు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. 

ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఆర్‌. నారాయణమూర్తి నిలదీశారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు