అవినీతిలో విజన్ డాక్యుమెంట్ రాసుకోండి: చంద్రబాబుకు జీవీఎల్ సూచన

By Nagaraju TFirst Published Nov 16, 2018, 7:05 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. అక్రమ సంపాదన ఆర్జించే వారికి కొమ్ముకాయడానికి, అవినీతిని ప్రోత్సహించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రవైటు కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే ఆయన మీద జరిగినట్లు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. అక్రమ సంపాదన ఆర్జించే వారికి కొమ్ముకాయడానికి, అవినీతిని ప్రోత్సహించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రవైటు కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే ఆయన మీద జరిగినట్లు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన జీవీఎల్ వారం రోజులుగా చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం ఏ విధంగా బెంబేలెత్తుతున్నారో చూస్తున్నామన్నారు. 3నెలల కిందట సీబీఐకి ఇచ్చిన అనుమతి ఇప్పుడు ఉపసంహరించుకోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. 

అక్రమ సంపాదన ఆర్జించే వారికి కొమ్ముకాయడానికా, అవినీతిని ప్రోత్సహించేందుకా అని నిలదీశారు. ఒక అవినీతి కూటమి కోసం రెండు సార్లు ఢిల్లీ వచ్చి వెళ్లారని జీవీఎల్ విమర్శించారు. అవినీతి చేయడం ఎలా? అవినీతి బయటపడకుండా ఉండటం ఎలా అనే విజన్ డ్యాంకుమెంట్‌ను చంద్రబాబు రాసుకోవాలని సూచించారు. 

సీబీఐలోని కలహాలను ఆసరాగా చేసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అప్రజాస్వామిక నిర్ణయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం పూర్తి పారదర్శక పాలన అందించాలని, అవినీతి అంతం చేయాలని చూస్తుంటే చంద్రబాబు దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జీవీఎల్ దుయ్యబట్టారు.

 

click me!
Last Updated Nov 16, 2018, 7:05 PM IST
click me!