లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట: ఎమ్మెల్యేకు వర్మ లీగల్ నోటీసు

Published : Dec 26, 2018, 05:24 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట: ఎమ్మెల్యేకు వర్మ లీగల్ నోటీసు

సారాంశం

 కర్నూల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీమోహన్ రెడ్డికి  సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు లీగల్ నోటీసు పంపారు.  వర్మ తన లాయర్ ద్వారా ఈ నోటీసును పంపారు.  


కర్నూల్: కర్నూల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీమోహన్ రెడ్డికి  సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు లీగల్ నోటీసు పంపారు.  వర్మ తన లాయర్ ద్వారా ఈ నోటీసును పంపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో  వెన్నుపోటు పాటను వర్మ యూట్యూబ్‌లో ఇటీవల  విడుదల చేశారు. ఈ పాట ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కించపర్చే విధంగా ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఈ పాటపై కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై  వర్మ గతంలోనే స్పందించారు.అయితే తనను వేధింపులకు గురి చేసేందుకే కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని రామ్‌గోపాల్ వర్మ ఆరోపిస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి  రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు లీగల్ నోటీసు పంపారు. 48 గంటల్లోపుగా తనకు క్షమాపణ చెప్పి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఆ నోటీసులో వర్మ కోరారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని  ఆయన హెచ్చరించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu