టీడీపీలోకి జూ. ఎన్టీఆర్: బాలయ్య చిన్నల్లుడు భరత్ వ్యాఖ్యలు ఇవీ..

Published : Nov 22, 2019, 11:49 AM ISTUpdated : Feb 07, 2020, 10:58 AM IST
టీడీపీలోకి జూ. ఎన్టీఆర్: బాలయ్య చిన్నల్లుడు భరత్ వ్యాఖ్యలు ఇవీ..

సారాంశం

సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అమరావతి: ఇంట్రెస్ట్ ఉంటే పార్టీలోకి  వచ్చి జూనియర్ ఎన్టీఆర్ పనిచేయవచ్చని... దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరని బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ అభిప్రాయపడ్డారు. అయితే పార్టీలో తమ నేత చంద్రబాబునాయుడేనని ఆయన చెప్పారు.

చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే తాము పనిచేస్తామన్నారు. కష్టకాలంలో వచ్చి పనిచేస్తామని అంటే ఎవరూ వద్దంటారని ఆయన తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆరే కాదు నందమూరి కుటుంబం నుండి ఎవరొచ్చినా  కూడ అభ్యంతరం లేదన్నారు.

Also read:జూ.ఎన్టీఆర్ కి పోటీగా చంద్రబాబు వ్యూహం: తెరపైకి మరో నందమూరి వారసుడు

గురువారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు  బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.  ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందన్నారు. అయితే ఈ కాలంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరొచ్చి పనిచేసినా ఎవరెందుకు కాదంటారని ఆయన ప్రశ్నించారు.

జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకొ రావొద్దని ఎవరన్నారని ఆయన ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ సహా ఎవరైనా వచ్చి పనిచేయొచ్చన్నారు. అందరం కలిసి పార్టీ  కోసం పనిచేద్దామని ఆయన కోరారు.

పార్టీలో యువరక్తం  రావాల్సిన అవసరం ఉందని కూడ శ్రీభరత్ అభిప్రాయపడ్డారు.  జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ సినిమా నటుడు. అయితే ఆయన ఉపన్యాసాలకు మంచి క్రేజీ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే కచ్చితంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

జూనియర్ ఎన్టీఆర్  మంచి ఉపన్యాసాలు ఇస్తాడని  ఆయన చెప్పారు. అయితే  జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావడం వల్ల క్యాడర్‌లో ఉత్సాహం వస్తోందన్నారు.అయితే అదే సమయంలో  ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తాము ఇద్దరం ఎక్కడ కలిసినా కూడ మంచిగా మాట్లాడుకొంటామన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వల్లే పార్టీ నిలబడుతోందనే వ్యాఖ్యలు సరికావన్నారు.

ఏదైనా విజయవంతం కావాలంటే సిస్టమ్ సరిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీకి ఓ సిస్టం ఉంది. వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకొంటే ఫలితాలు  వస్తాయని ఆయన చెప్పారు. అయితే అదే సమయంలో  వ్యవస్థ సరిగా లేకుంటే ఎంత మంది వ్యక్తులు వచ్చినా ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబునాయుడు తనకు అవకాశం ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. వచ్చే 30 ఏళ్ల పాటు  పార్టీని నడిపించేందుకు పార్టీకి యువ రక్తం అవసరం ఉందని  శ్రీభరత్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తాము చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!