ఎఎన్నాఆర్ నాకు బాబాయి:అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై బాలకృష్ణ వివరణ

Published : Jan 26, 2023, 01:59 PM ISTUpdated : Jan 26, 2023, 02:16 PM IST
ఎఎన్నాఆర్ నాకు బాబాయి:అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై బాలకృష్ణ వివరణ

సారాంశం

అక్కినేని నాగేశ్వరరావును కించపర్చాలనే ఉద్దేశ్యంతో  తాను వ్యాఖ్యలు చేయలేదని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు.  యాధృచ్చికంగా  వచ్చిన మాటలని  ఆయన వివరణ ఇచ్చారు.  

అనంతపురం: అక్కినేని నాగేశ్వరరావుపై తనకు గుండెల్లో  ప్రేమ ఉంటుందని  సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు.  అనంతపురం  జిల్లాలో  గురువారం నాడు  సినీ నటుడు బాలకృష్ణ స్పందించారు.  వీర సింహరెడ్డి సినిమా ఫంక్షన్ లో  అక్కినేని తొక్కినేని అంటూ  బాలకృష్ణ  వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై  అక్కినేని  అభిమాన సంఘాలు  స్పందించాయి. అక్కినేని నాగేశ్వరరావును కించపర్చేలా  చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు డిమాండ్  చేశారు. ఈ వ్యాఖ్యలపై నాగ చైతన్య  ట్విట్టర్ వేదికగా  కూడా  స్పందించారు.ఈ వ్యాఖ్యలపై  బాలకృష్ణ ఇవాళ స్పందించారు. 

also read:ముదురుతున్న వివాదం.. బాలకృష్ణ దిష్టి బొమ్మ దహనం, క్షమాపణలకు డిమాండ్

 సినిమా ఫంక్షన్ లో   అక్కినేని తొక్కినేని అంటూ  చేసిన వ్యాఖ్యలు  యాదృచ్చికంగా  చేసినవేనన్నారు. అక్కినేని నాగేశ్వరరావును  కించపర్చే ఉద్దేశ్యం తనకు  లేదన్నారు. అక్కినేని  నాగేశ్వరరావును తాను బాబాయి అని పిలుస్తానన్నారు. బాబాయిపై తనకు  ప్రేమ గుండెల్లో ఉంటుందన్నారు.  బయట జరిగే వాటి గురించి పట్టించుకోనన్నారు.  నాగేశ్వరరావు  తన పిల్లలకంటే  తనపై ఎక్కువగా ప్రేమ చూపించేవారని ఆయన గుర్తు  చేసుకున్నారు.   పొగడ్తలకు పొంగిపోకూడదని తాను  బాబాయి నుండి నేర్చుకున్నానని  బాలకృష్ణ చెప్పారు.  ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లు  సినీ రంగానికి రెండు కళ్లు లాంటివాళ్లని ఆయన  తెలిపారు.  
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu