నమ్మకం నిలబెట్టుకోవాలి...అలీ కామెంట్స్

Published : May 30, 2019, 12:58 PM IST
నమ్మకం నిలబెట్టుకోవాలి...అలీ కామెంట్స్

సారాంశం

అపారమైన నమ్మకంతో ప్రజలు... జగన్ ని గెలిపించారని సినీ నటుడు, వైసీపీ నేత అలీ అన్నారు. ఈ రోజు వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడారు.

అపారమైన నమ్మకంతో ప్రజలు... జగన్ ని గెలిపించారని సినీ నటుడు, వైసీపీ నేత అలీ అన్నారు. ఈ రోజు వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడారు.

 ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని... ఆ నమ్మకాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు  నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా అలీ కోరారు. వైసీపీ అఖండ విజయం సాధించడం మామూలు విషయ కాదని, మిరాకిల్‌ అని వర్ణించారు. కొత్త ఇంటికి నవధాన్యాలు ఎంత ముఖ్యమో కొత్త రాజధాని అమరావతికి వైఎస్సార్‌సీపీ నవతర్నాల పథకాలు అంతముఖ్యమని అన్నారు.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రూపు తీసుకొస్తారని  ఆకాంక్షించారు. నవతర్నాలతో మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి వాతావరణం కూడా అను​కూలించిందన్నారు. జగన్‌ పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. మైనార్టీలంతా వైఎస్‌ జగన్‌కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్